Amaravathi: ఇటువంటి పిచ్చి ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది: కన్నా లక్ష్మీనారాయణ
- జీఎన్ రావు కమిటీకి శాస్త్ర్రీయత ఏముంది?
- ప్రభుత్వ ఆలోచన మేరకు ఈ కమిటీ రాసుకొచ్చింది
- రాష్ట్రానికి సీఎం మారితే రాజధాని మారుతుందా?
ఏపీ రాజధానిపై నియమించిన జీఎన్ రావు కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, జీఎన్ రావు కమిటీకి శాస్త్ర్రీయత ఏముంది? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆలోచన మేరకు ఈ కమిటీ రాసుకొచ్చిందని విమర్శించారు.
పరిపాలనా వికేంద్రీకరణ చేయాలన్న సీఎం జగన్ ఆలోచన ఈ రాష్ట్రాభివృద్ధికి విఘాతం కల్గిస్తుందని అన్నారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారుతుందన్న విషయం అభివృద్ధికి గొడ్డలిపెట్టులాంటిదని అన్నారు. ఇటువంటి పిచ్చి ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందే తప్ప ముందుకుపోదని అభిప్రాయపడ్డారు.