Wi-Fi Calling: వైఫై కాలింగ్... ఎయిర్ టెల్ తెలుగు రాష్ట్రాల కస్టమర్లకు కొత్త వరం!

  • డేటా కనెక్షన్ లేకున్నా కాలింగ్ సౌకర్యం
  • ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు
  • తాజా వర్షన్ కు ఫోన్ సిస్టమ్ అప్ డేట్ చేసుకుంటే చాలు
  • ఎయిర్ టెల్ ఏపీ, టీఎస్ సీఈఓ అన్వీస్ సింగ్ పూరి

తెలుగు రాష్ట్రాల్లోని తమ కస్టమర్లకు ఎయిర్ టెల్ మరో సదుపాయాన్ని దగ్గర చేసింది. డేటా కనెక్షన్, రీచార్జ్ లేకున్నా, వైఫై సదుపాయంతో కాల్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకు వచ్చామని పేర్కొంది. మరింత మెరుగైన వాయిస్ కాలింగ్ అనుభూతి కలుగుతుందని, ఏ నెట్ వర్క్ లోని కస్టమర్లకైనా వైఫై ద్వారా కాల్స్ చేసుకోవచ్చని, రిసీవ్ చేసుకోవచ్చని, ఇందుకు ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని పేర్కొంది. ఈ విషయాన్ని ఎయిర్ టెల్ తెలుగు రాష్ట్రాల సీఈఓ అన్వీస్ సింగ్ పూరీ పేర్కొన్నారు.

ఈ సదుపాయం తెలుగు రాష్ట్రాల్లోని కస్టమర్లకు తొలుత అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఇక ఈ సదుపాయం పొందేందుకు ఎటువంటి యాప్ అవసరం లేదని, వైఫై కాలింగ్ కు మద్దతిచ్చేలా తాజా వర్షన్ కు ఫోన్ సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేసుకుంటే చాలని అన్వీస్ సింగ్ వెల్లడించారు. ఆపై మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ లో వైఫై కాలింగ్ స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 6ఎస్ ఆపై వెలువడిన అన్ని యాపిల్ ఫోన్లతో పాటు, శాంసంగ్ జే6, ఏ 10, ఒన్ 10, ఎస్ 10 ప్లస్, ఎస్ 10ఈ, వన్ ప్లస్ 6, 7 సీరీస్ ఫోన్లు, రెడ్ మీ కే 20, కే 20 ప్రో తదితర ఫోన్లన్నీ సపోర్ట్ చేస్తాయని తెలిపారు.

  • Loading...

More Telugu News