CAA: సీఏఏను అమలు చేయబోమనే యాడ్స్ ను ఆపండి: పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు
- చట్టాన్ని అమలు చేయబోమంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రకటనలు
- ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా హైకోర్టులో పలు పిటిషన్లు
పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని తాము అమలుచేయబోమని ప్రకటన కూడా చేసేశాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఆందోళనను తీవ్రతరం చేసింది. మరోవైపు, ఈ చట్టాన్ని అమలు చేయబోమంటూ బెంగాల్ ప్రభుత్వం యాడ్స్ కూడా ఇస్తోంది. ఈ నేపథ్యంలో, వెంటనే ఈ యాడ్స్ ను ఆపేయాలంటూ కోల్ కతా హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుంటే... మరోవైపు మమత ప్రభుత్వం ఇలాంటి యాడ్స్ ను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు... ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.