BJP: పౌరసత్వ సవరణ చట్టంపై నేతాజీ మనవడు చంద్ర కుమార్ బోస్ విమర్శలు
- అన్ని మతాలు, వర్గాలను ఆహ్వానించే దేశం భారత్
- హిందువులు, సిక్కులు, బౌద్ధుల గురించే ఎందుకు మాట్లాడుతున్నారు?
- సీఏఏలో ముస్లింలను ఎందుకు కలపలేదు?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ఈ చట్టానికి మద్దతు తెలుపుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తుండగా బీజేపీ నేత, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్ర కుమార్ బోస్ సొంత పార్టీ తీరుకి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు.
అన్ని మతాలు, వర్గాలను ఆహ్వానించే దేశం భారత్ అంటూ చంద్ర కుమార్ బోస్ పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఏ మతానికి సంబంధించింది కాదని కేంద్ర ప్రభుత్వం అంటోందని, మరి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, పార్సీలు, జైన్ల గురించే ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. సీఏఏలో ముస్లింలను ఎందుకు కలపలేదు? అని ప్రశ్నించారు. మనం పారదర్శకంగా ఉండాలని ఆయన హితవు పలికారు.