shiv sena: పరిశుభ్రతే పారిశుద్ధ్య కార్మికుల పాలిట యమదూతగా మారింది: శివసేన

  • సెప్టిక్ ట్యాంక్ లలో చిక్కుకొని, ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నారు
  • వారి బాధలపై సమాజం సున్నితంగా వ్యవహరించట్లేదు
  • పరిశుభ్రతకు నిజమైన అంబాసిడర్లు పారిశుద్ధ్య కార్మికులే 

సెప్టిక్ ట్యాంక్ లలో చిక్కుకొని, ఊపిరాడక ప్రాణాలు కోల్పోతోన్న పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితులపై శివసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. వారి బాధలపై పరిపాలనా విభాగాలు కానీ, సమాజం కానీ సున్నితంగా వ్యవహరించట్లేదని తమ పార్టీ పత్రిక సామ్నాలో పేర్కొంది. ముంబయిలోని గోవండిలో ఇటీవల ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు సెప్టిక్ ట్యాంకులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో దేశంలోని పారిశుద్ధ్య కార్మికుల బాధలపై సామ్నాలో ఓ కథనం ప్రచురితమైంది.

పారిశుద్ధ్య కార్మికులకు పరిశుభ్రతే యమదూతగా మారిందని శివసేన పేర్కొంది. గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో ఇటువంటి విచారకర ఘటనలు జరిగాయని గుర్తు చేసింది. సెప్టిక్ ట్యాంకులు, మ్యాన్ హోల్స్ లు పారిశుద్ధ్య కార్మికుల పాలిట గ్యాస్ చాంబర్లుగా మారాయని పేర్కొంది. పరిశుభ్రతకు నిజమైన అంబాసిడర్లు పారిశుద్ధ్య కార్మికులేనని, కానీ ఇదే విషయం వారి పాలిట యమదూతగా మారిందని శివసేన ఆవేదన వ్యక్తం చేసింది. 

  • Loading...

More Telugu News