kanaka medala: పార్లమెంటులో ప్రస్తావిస్తాం.. కోర్టుల్లో కేసులు వేస్తాం: రాజధాని గందరగోళంపై ఎంపీ కనకమేడల
- రాజధాని తరలింపు అనేది ఉన్మాద చర్య
- అమరావతికి రక్షణగా ఎన్నో చట్టాలు ఉన్నాయి
- జీఎన్ రావు కమిటీకి ఏ చట్టబద్ధత ఉంది?
- రాజధానిని, హైకోర్టును తరలించాక అమరావతిలో ఇంకేముంటుంది?
అమరావతి రాజధానిపై నెలకొన్న గందరగోళంపై మందడంలో రైతులు చేస్తోన్న ధర్నాకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కనకమేడల మీడియాతో మాట్లాడుతూ... రాజధాని రైతుల ఆందోళనను పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. రాజధాని కోసం కోర్టుల్లో కేసులు వేస్తామని అన్నారు.
రాజధాని తరలింపు అనేది ఉన్మాద చర్య అని కనకమేడల మండిపడ్డారు. అమరావతికి రక్షణగా ఎన్నో చట్టాలు ఉన్నాయని, జీఎన్ రావు కమిటీకి ఏ చట్టబద్ధత ఉంది? అని ఆయన ప్రశ్నించారు. రాజధానే కాదు.. హైకోర్టు తరలింపును కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
రాజధానిని, హైకోర్టును తరలించాక అమరావతిలో ఇంకేముంటుంది? అని కనకమేడల ప్రశ్నించారు. అమరావతిలోనే రాజధాని ఉండేలా ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు, అమరావతిని శ్మశానం, ఏడారి అంటూ కొందరు అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.