North India: ఉత్తరాదిపై చలి పులి పంజా...గజ గజలాడుతున్న జనం!

  • పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పై తీవ్ర ప్రభావం 
  • చలిగాలులతో అల్లాడిపోతున్న జనం 
  • ఉదయం పూట తీవ్రంగా కురుస్తున్న మంచు

చలిగాలులు, తీవ్రంగా కురుస్తున్న మంచు కారణంగా ఉత్తరభారతావని వాసులు గజగజ వణుకుతున్నారు. ముఖ్యంగా, ఉత్తరాదిలోని ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ పై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడం, చలి గాలుల ప్రభావంతో జనం వణుకుతున్నారు.

ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్ పొగమంచు దట్టంగా కమ్ముకుంటోందని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, బీహార్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, సబ్ హిమాలయన్ రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో చలి తీవ్రత ఇంకా ఎక్కువ ఉందని తెలిపింది.

 చురు, లక్నో, బహరైచ్, గువాహటి, గ్వాలియర్, డెహ్రాడూన్, చంఢీఘడ్చ పాటియాలా ప్రాంతాల్లో మంచు విస్తారంగా కురుస్తోంది.  పశ్చిమబెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, త్రిపుర, జార్ఖండ్ ప్రాంతాల్లో కూడా ఉదయం దట్టంగా మంచు కురుస్తోంది. ఈ చలిగాలులతో ఉత్తరాది ప్రజలు అవస్థలు పడుతున్నారు. 

  • Loading...

More Telugu News