Amaravathi: ఈ పేదలేనా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ చెబుతోంది?: నారా లోకేశ్

  • రాజధాని కోసం భూములిచ్చింది అధికశాతం సన్నకారు రైతులే
  • వీళ్లకేనా వైసీపీ నేతలు కులం అంటగడుతోంది
  • పేదరికానికి కూడా కులం ఉంటుందా?

ఏపీ రాజధాని అమరావతిని తరలించడమంటే.. తమ పొలాలను త్యాగం చేసిన రైతులను అవమానించడమేనంటూ ప్రభుత్వంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన వారిలో అధిక శాతం మంది సన్నకారు రైతులేనని, వీరికి కులం అంటగడతారా అంటూ వైసీపీ నేతలపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు.  

రాజధాని కోసం భూములిచ్చిన రైతులు 29,881 మంది, 34,322 ఎకరాలు ఇచ్చారని అన్నారు. వీరిలో ఒక ఎకరం కన్నా తక్కువ ఉన్న రైతులు 20,490 మంది అని, ఒకటి నుంచి రెండు ఎకరాలకు మధ్య ఉన్న వారు 5,227 మంది రైతులని అన్నారు. కేవలం,159 మందికి మాత్రమే 10 ఎకరాలకు మించి భూమి ఉందని, అందులో కూడా కొంతమందివి ఉమ్మడి కుటుంబాలని తెలిపారు. అంటే, రాజధానికి భూములిచ్చిన రైతుల్లో సుమారు 90 శాతం మంది సన్నకారు రైతులేనని, వీళ్లకేనా వైసీపీ నేతలు కులం అంటగట్టి కక్ష తీర్చుకుంటోందంటూ మండిపడ్డారు. ఈ పేదలేనా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ చెబుతోంది? పేదరికానికి కూడా కులం ఉంటుందా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News