whatsapp: వాట్సాప్‌లో డార్క్‌మోడ్.. ఇక కళ్లు భద్రం!
- వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త
- ఇప్పటికే కొందరికి అందుబాటులోకి
- రాత్రివేళ కళ్లకు తప్పనున్న శ్రమ
వాట్సాప్ వినియోగదారులకు ఇది శుభవార్తే. రాత్రవేళ్లలో కళ్లకు శ్రమ తెలియకుండా చేసేందుకు వాట్సాప్ డార్క్‌మోడ్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ వెర్షన్ రెడీ అయిందని, ఐవోఎస్ వెర్షన్ కూడా సిద్ధమవుతోందని వాట్సాప్ తెలిపింది. ఆండ్రాయిడ్ యూజర్లలో కొందరికి ఇప్పటికే డార్క్‌మోడ్ అందుబాటులోకి వచ్చిందని బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్ వెబ్సైట్ తెలిపింది.
డార్క్‌మోడ్ వల్ల కళ్లకు శ్రమ తప్పుతుంది. సాధారణంగా ఇంటర్నెట్లో సమాచారమంతా తెల్లని బ్యాక్‌గ్రౌండ్‌లో నల్లని అక్షరాల్లో ఉంటుంది. దీనివల్ల రాత్రివేళ కళ్లకు విపరీతమైన శ్రమ కలుగుతుంది. ఈ కారణంగా ఇప్పుడు వాట్సాప్ డార్క్‌మోడ్‌ను తీసుకొస్తోంది. ఇందులో నల్లని బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లని అక్షరాలు కనిపిస్తాయి. దీనివల్ల రాత్రివేళ వాట్సాప్‌ను ఉపయోగించే వారి కళ్లకు శ్రమ తగ్గుతుందని వాట్సాప్ పేర్కొంది.