onion: హైదరాబాదులోని ఎర్రగడ్డ రైతు బజార్ లో రూ.40కే కిలో ఉల్లి

  • ఒక్కొక్కరికి రెండు కిలోల మేర ఉల్లిగడ్డల విక్రయం
  • రాయితీపై విక్రయం.. క్యూ కట్టిన ప్రజలు
  • దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న ఉల్లి ధరల పెరుగుదల 

దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డల ధరలు పెరిగిపోయిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యమైన ఉల్లిగడ్డల ధర కిలో రూ.100 నుంచి రూ.150  మధ్య పలుకుతోంది.  ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ రైతు బజార్ కు ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లి వచ్చింది. దీంతో ఒక్కొక్కరికి రెండు కిలోల మేర ఉల్లిగడ్డలను విక్రయిస్తున్నారు. కిలో ఉల్లిగడ్డలు రూ.40 చొప్పున రాయితీపై విక్రయిస్తుండడంతో ప్రజలు క్యూలో నిలబడి తీసుకుంటున్నారు.

కాగా, ఉల్లి కొరతను అధిగమించేందుకు విదేశాల నుంచి కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటోంది. ఈజిప్టు, టర్కీ నుంచి భారత్‌ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. అయితే, భారత్‌కు ఉల్లి ఎగుమతి చేసేందుకు పోటీ నెలకొనడంతో టర్కీ  మార్కెట్లో ఉల్లి ధరలు పెరగడం మొదలు కావడంతో వాటి ఎగుమతిపై టర్కీ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఈజిప్టు నుంచి మాత్రమే దేశానికి ఉల్లి దిగుమతి అవుతోంది.

  • Loading...

More Telugu News