iyr krishna rao: జీఎన్ రావు కమిటీ సిఫారసులను ప్రస్తావిస్తూ.. ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నల వర్షం
- ఎంత అధికార వికేంద్రీకరణ చేసి కమిషనరేట్ లను బలోపేతం చేస్తారు?
- రాష్ట్ర స్థాయిలో విభాగ కమిషనరేట్లు కొనసాగుతాయా?
- కొనసాగేటట్లు అయితే ఇవి అదనపు భారం అవుతాయి
- ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఉంటాయా?
ఏపీ రాజధాని విషయంపై జీఎన్ రావు కమిటీ ముఖ్యమైన సిఫారసు నాలుగు ప్రాంతీయ కమిషనరేట్లని, కానీ, వాటి ప్రాధాన్యత కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుందని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలను సంధించారు. ఎంత అధికార వికేంద్రీకరణ చేసి కమిషనరేట్ ల ను బలోపేతం చేస్తారు? రాష్ట్ర స్థాయిలో విభాగ కమిషనరేట్లు కొనసాగుతాయా? కొనసాగేటట్లు అయితే ఇవి అదనపు భారం అవుతాయి అని పేర్కొన్నారు.
'ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఉంటాయా? వాటికి, ఈ కమిషనరేట్ లకు ఎటువంటి సంబంధం ఉంటుంది? అభివృద్ధి మండల చైర్మన్లు ఎన్నుకోబడతారా? నామినేట్ చేయబడతారా? ఎన్నుకోబడితే ఎమ్మెల్యేలకు పోటీ. నామినేషన్ అయితే ఎటువంటి ప్రయోజనం సాధించలేరు' అని తన ట్విట్టర్ ఖాతాలో ఐవైఆర్ కృష్ణారావు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రత్యేకత కలిగిన వివిధ ప్రాంతాలు ఉన్న ఏ రాష్ట్రంలోనూ వివిధ ప్రాంతాల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా తీసుకున్న దీర్ఘకాలిక నిర్ణయాలు విఫలమవడమే కాక భవిష్యత్తులో సమస్యలు సృష్టిస్తాయని ఆయన మరో ట్వీట్ లో పేర్కొన్నారు.