comments on Amaravari capital: మూడు ప్రాంతాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి

  • రాజధానిని మార్చడం లేదు  
  • విపక్ష నేతలది రెండు నాల్కల ధోరణి 
  • అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారు

మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చినట్లు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నివేదికను స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాంతాల అభివృద్ధికోసం ప్రణాళిక రూపొందిస్తోందని చెప్పారు. రాజధానిని మార్చడం లేదని పేర్కొన్నారు. రైల్వే కోడూరులో మిథున్ రెడ్డి తన పార్టీ నేతలతో కలిసి మీడియాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, మండల నాయకులు రామిరెడ్డి, ధ్వజరెడ్డి, చెవ్వు శ్రీనివాసులరెడ్డి, మైనారిటీ నాయకులు అన్వర్‌బాషా తదితర వైసీపీ నేతలు పాల్గొన్నారు.

విపక్ష నేతలు విశాఖ అభివృద్ధికి సహకరిస్తామంటూనే.. రాజధాని మార్పు సహించమని రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు.  మూడు ప్రాంతాల్లో అభివృద్ధికి సహకరిస్తామని చెప్పిన ప్రతిపక్ష నేతలు.. అమరావతిలో రాజధాని రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం భూములను అభివృద్ధిచేసి రైతులకు అప్పగిస్తుందన్నారు. ప్రతిపక్షం అభివృద్ధిని స్వాగతించాల్సింది పోయి బురదజల్లే కార్యక్రమం చేపట్టిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ ప్రకారం రాజధాని అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించారని.. ఎవరికీ ఎటువంటి నష్టం కలగకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News