Sensex: భారీ నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు

  • 297 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 88 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా నష్టపోయిన భారతి ఎయిర్ టెల్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. హెవీవెయిట్ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్ టెల్ వంటి కంపెనీల షేర్లు ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. మధ్యాహ్నం తర్వాత బ్యాంకింగ్ షేర్లు కూడా కుదేలు కావడంతో నష్టాలు మరింత పెరిగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 297 పాయింట్లు పతనమై 41,163కి పడిపోయింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 12,126కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (1.63%), ఎన్టీపీసీ (1.09%), టాటా స్టీల్ (1.06%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.40%), ఏసియన్ పెయింట్స్ (0.29%).

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-2.23%), ఎల్ అండ్ టీ (-1.72%), సన్ ఫార్మా (-1.72%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.38%), మారుతి సుజుకి (-1.18%).

  • Loading...

More Telugu News