NPR: ఎన్పీఆర్ అనేది ఎన్నార్సీకి సన్నాహకమంటూ విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి: కిషన్ రెడ్డి
- ఎన్పీఆర్ పై వివరణ ఇచ్చిన కిషన్ రెడ్డి
- ఇది జనాభా లెక్కలకు సంబంధించిన విషయమన్న మంత్రి
- విపక్షాలపై ఆగ్రహం
ఎన్పీఆర్ (జాతీయ జనాభా పట్టిక)ను ఎన్నార్సీతో లింకు పెడుతూ విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. వాస్తవానికి ఎన్పీఆర్ కు, ఎన్నార్సీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్పీఆర్ అనేది ఎన్నార్సీకి సన్నాహకం అనే ప్రచారంలో నిజంలేదని అన్నారు. ఇప్పుడు తాము తీసుకువస్తున్న ఎన్పీఆర్ 2021లో జరిగే జనాభా లెక్కలకు సంబంధించిన అంశమని వెల్లడించారు. ఎన్పీఆర్ ప్రక్రియను ప్రారంభించింది యూపీఏ ప్రభుత్వమేనని, దాన్ని తాము కొనసాగిస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓ పౌరుడి తల్లిదండ్రులు, ఆధార్ వివరాలు మాత్రమే ఎన్పీఆర్ లో ఉంటాయని వివరించారు.