Congress MP Komatireddy Venkatareddy: సీఏఏ, ఎన్నార్సీలపై సీఎం కేసీఆర్ నోరు విప్పాలి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకించారు
- కేసీఆర్ మోదీ మాయ నుంచి బయటకు రావాలి
- మోదీ ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్ర చేస్తోంది
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)పై ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నార్సీ, సీఏఏతో దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు మోదీ సర్కార్ కుట్ర పన్నిందన్నారు. మోదీ మాయ నుంచి కేసీఆర్ బయటకు రావాలని సూచించారు. సీఏఏపై పార్లమెంట్ లో జరిగిన చర్చలో టీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకించారని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దీనిపై నిరసనలు, ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో.. కేసీఆర్ నోరు విప్పాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని కోమటిరెడ్డి ఆరోపించారు.