Chaina: ఆ ల్యాప్‌టాప్‌ బరువు 700 గ్రాములే : చైనాకు చెందిన మ్యాజిక్‌ బెన్‌ ‘మ్యాగ్‌-1’ సరికొత్త డివైస్‌

  • ప్రపంచంలోనే అతి చిన్నదిగా గుర్తింపు
  • ఏ 5 కాగితం అంత పరిమాణం
  • యాపిల్‌ ల్యాప్‌టాప్‌ కంటే అధిక పోర్టులు సపోర్టు

సంచలనాలు సృష్టించాలి, ప్రపంచాన్ని ఆకర్షించాలి, అగ్రరాజ్యంగా ఎదగాలని అనుక్షణం ఉవ్విళ్లూరుతుండే చైనా కంప్యూటర్‌ రంగంలో సరికొత్త ఆవిష్కరణతో  ఆకట్టుకుంటోంది. చైనాకు చెందిన  మ్యాజిక్‌ బెన్‌ సంస్థ ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ‘మ్యాగ్‌-1’ డివైస్‌ను అభివృద్ధి చేసి ప్రపంచం తన వైపు చూసేలా చేసింది. కేవలం 700 గ్రాముల బరువు ఈ ల్యాప్‌టాప్‌ ప్రత్యేకం. ఏ5 పేపర్‌ అంత పరిమాణంలో ఉండడం దీని మరో ప్రత్యేకం. అయినప్పటికీ యాపిల్‌ ల్యాప్‌టాప్‌, మ్యాక్‌బుక్‌ను మించిన పోర్టులు ఇందులో సపోర్టు చేయడం అంతకంటే విశేషం. 30 ఆంపియర్‌ అవర్‌ (ఏహెచ్‌ఆర్‌) బ్యాటరీ సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది.

టచ్‌ స్క్రీన్‌, ఇంటెల్‌ కోర్‌ ఎం3-8100వై సీపీయూ, 16 జీబీ మెమరీ, 512 జీబీ డ్రైవ్‌ వంటి ఫీచర్లతో ఉన్న దీని ధర 790 డాలర్లుగా సంస్థ ప్రకటించింది. దీన్ని అంతర్జాతీయ మార్కెట్లోకి ఎప్పుడు తెచ్చేది సంస్థ ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News