Telugu: తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు పంచాలి: ఎమ్మెల్సీ మాధవ్

  • తెలుగు మాధ్యమంలో రాణించే వారికి ఉద్యోగాలివ్వాలి 
  • ఆంగ్లంపై చట్టం చేసుకునేంత ధైర్యం రావడం దురదృష్టం 
  • భాషను ఓట్లతో ముడి పెడితే రాజకీయ పార్టీలు పట్టించుకుంటాయి

తెలుగుభాష ఔన్నత్యం, ప్రస్తుత పరిస్థితిపై ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ, బీజేపీ నేత పి.వి.ఎన్.మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంగ్లం కోసం చట్టం చేసుకునే పరిస్థితి వచ్చిందంటే మనం ఎక్కడ ఉన్నామో గుర్తుంచుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. 

ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు పంచాల్సిన బాధ్యత అన్ని వర్గాలపై ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు కొన్ని చర్యలు అవసరమని చెప్పారు. తెలుగులో బాగా రాణించే వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం ఇవ్వడం ఒకటని, అలాగే ఓట్లతో భాషను ముడి పెడితే రాజకీయ పార్టీలు పరభాషల అమలుకు భయపడే అవకాశం ఉందని ఆయన సూచించారు. పాలకుల ఆలోచనలు సక్రమంగా లేకపోవడం వల్లే మాతృభాష అమల్లో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News