Andhra Pradesh: ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల ర్యాలీ

  •  బస్ స్టేషన్ల వద్ద  ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్
  •  ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోందన్న కార్మిక సంఘాల నేతలు  
  • అధికారులకు వినతి పత్రాల అందజేత  

ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు, ఆర్టీసీ మనుగడకు ప్రతిబంధకంగా మారాయని ఆర్టీసీ కార్మికులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ట్రావెల్స్‌ సంస్థల ఆగడాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు నడుం బిగించారు. బస్ స్టేషన్ల వద్ద  ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ.. బెజవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝళిపించినప్పటికీ, ఫలితం లేకపోతోందని పేర్కొన్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. విజయవాడ పోలీస్ కమిషనర్, జిల్లా రవాణా శాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.

  • Loading...

More Telugu News