Ravela Kishore Babu: సమాధానం చెప్పకుంటే కోర్టులో పిటిషన్ వేస్తా: రావెల కిశోర్ బాబు
- ఇన్ సైడర్ ట్రేడింగ్ ను బూచిగా చూపుతున్నారు
- అమరావతిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు
- నేను మైత్రి సంస్థ పేరిట భూమి కొన్నానని దుష్ప్రచారం చేస్తున్నారు
- దమ్మూ, ధైర్యం ఉంటే నిరూపించాలి
అమరావతి రాజధాని భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేండింగ్ జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. మైత్రి సంస్థ పేరుతో బీజేపీ నేత రావెల కిశోర్ బాబు బినామీలకు భూములు కట్టబెట్టారని వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ విషయంపై సమాధానం చెప్పకుంటే కోర్టులో పిటిషన్ వేస్తానని హెచ్చరించారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ ను బూచిగా చూపుతూ రాజకీయాలు చేస్తున్నారని రావెల కిశోర్ బాబు అన్నారు. అమరావతిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తాను మైత్రి సంస్థ పేరిట భూమి కొన్నానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్మూ, ధైర్యం ఉంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాలు విసిరారు.