chalasani: ప్రతి దేశంలోనూ మాతృభాషలోనే విద్యను బోధిస్తున్నారు: చలసాని శ్రీనివాస్
- స్థానిక ఉద్యోగాల్లో తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలి
- మేము పోరాడుతున్నది వ్యక్తులపై కాదు
- ప్రభుత్వాలపై పోరాడుతున్నాం
- ఎనిమిది రాష్ట్రాల్లో తెలుగు పాఠశాలలు ఉన్నాయి
ప్రతి దేశంలోనూ మాతృభాషలోనే విద్యను బోధిస్తున్నారని ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక ఉద్యోగాల్లో తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తాము పోరాడుతున్నది వ్యక్తులపై కాదని ప్రభుత్వాలపై పోరాడుతున్నామని చలసాని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో తెలుగు బతికితేనే తెలుగు రచయితలు ఉంటారని ఆయన చెప్పారు. ఎనిమిది రాష్ట్రాల్లో తెలుగు పాఠశాలలు ఉన్నాయని ఆయన తెలిపారు.