Mopidevi Venkata Ramana: రెండు కమిటీల నివేదికలను అధ్యయనం చేయడానికే సీఎం హైపవర్ కమిటీ వేశారు: మోపిదేవి

  • తుది నిర్ణయం హైపవర్ కమిటీదేనన్న మంత్రి
  • రైతులకు అన్యాయం జరగదని వెల్లడి
  • తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని వ్యాఖ్యలు

ఏపీలో ప్రస్తుత రాజకీయాలన్నీ రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. ఓవైపు రాజధాని కోసం అమరావతి రైతులు తీవ్రస్థాయిలో నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తుండగా, మరోవైపు ప్రభుత్వం రాజధానిపై కమిటీలు నియమిస్తూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. తాజాగా, ఈ అంశంపై మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందించారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అందించే నివేదికలను అధ్యయనం చేయడానికే సీఎం జగన్ హైపవర్ కమిటీ వేశారని వెల్లడించారు. రాజధానిపై తుది నిర్ణయం తీసుకునేది హైపవర్ కమిటీయేనని స్పష్టం చేశారు. సర్కారు తీసుకోబోయే నిర్ణయంతో అమరావతి రైతులకు ఎలాంటి నష్టం జరగదని, తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని అన్నారు.

  • Loading...

More Telugu News