cpm: ఏపీ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోంది: సీపీఎం మధు

  • అన్ని పార్టీలను పిలిచి వారి అభిప్రాయాలను తీసుకోవాలి
  • రాజధాని అంశం చర్చనీయాశంగా మారింది
  • అసెంబ్లీ ఒక చోట, రాజధాని ఇంకో చోట ఉంటుందంటున్నారు
  • ఇలా చెప్పడం ఆందోళన కలిగిస్తోంది

రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని సీపీఎం నేత మధు విమర్శలు గుప్పించారు. విజయవాడ ఐఎంసీ హాలులో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఏపీ రాజధాని అమరావతిపై సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ పార్టీల నేతలు హాజరై తమ అభిప్రాయాలు తెలిపారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ... అన్ని పార్టీలను పిలిచి ప్రభుత్వం వారి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు.

రాజధాని అంశం చర్చనీయాంశంగా మారిందని, తాము రైతులు, రాజధాని కోసం పోరాడతామని మధు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని, అసెంబ్లీ ఒక చోట, రాజధాని ఇంకో చోట ఉంటుందని చెప్పడం ఆందోళన కలిగిస్తోందని విమర్శలు గుప్పించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఇటువంటి చర్యలకు పాల్పడడం వల్ల ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News