CAA Sadhguru Jaggiraja vasudev comments on CAA: 'సీఏఏ'పై సద్గురు జగ్గీ వాసుదేవ్ సందేశం అందరూ వినాలి: ప్రధాని మోదీ
- పౌరసత్వంపై పూర్వాపరాలు వెల్లడించారు
- ఈ చట్టాన్ని భారతీయులు ఎందుకు గౌరవించాలో తెలిపారు
- కొంతమంది సొంత ప్రయోజనాల కోసం సీఏఏను వక్రీకరించడంపై కూడా వ్యాఖ్యానించారు
పౌరసత్వ చట్టంపై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ చేసిన సందేశాన్ని అందరూ తెలుసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. ఈ మేరకు మోదీ ఒక సందేశాన్ని ట్వీట్ చేశారు. సీఏఏపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ చట్టం, ఓ వర్గానికి వ్యతిరేకం అంటున్నారు. 11 రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసేది లేదని చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ తన ప్రసంగంలో ఈ చట్టాన్ని భారతీయులు ఎందుకు గౌరవించాలన్న దానిపైనా.. కొంతమంది తన సొంత ప్రయోజనాల కోసం దీన్ని వక్రీకరించడంపైనా సద్గురు వ్యాఖ్యానించారు. అసలు పౌరసత్వం చరిత్ర ఏమిటి? పూర్వం ఏం జరిగింది? ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.. ఇలాంటి అంశాలన్నింటినీ సద్గురు తన ప్రసంగంలో చెప్పారు. నిజా నిజాలు తెలుసుకోవాలంటూ.. ప్రధాని మోదీ సదరు వీడియోను ట్వీట్ చేశారు.