PAN: పాన్ తో ఆధార్ అనుసంధానం గడువు మరోసారి పొడిగింపు
- రేపటితో ముగియనున్న పాత గడువు
- వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొత్త గడువు
- నిర్ణయం తీసుకున్న ప్రత్యక్ష పన్నుల బోర్డు
భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు, ఐటీ రిటర్నుల దాఖలుకు ఉపకరించే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించాలని కేంద్రం ఎప్పటినుంచో చెబుతోంది. అందుకు గడువు కూడా విధించింది. సెప్టెంబరులో ఓసారి ఆ గడువును పొడిగించారు. ఆ గడువు డిసెంబరు 31తో ముగియనుండగా, మరోసారి గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్ణయం తీసుకుంది. 2020 మార్చి 31 వరకు తాజా గడువు పొడిగించారు. అప్పటిలోగా పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని బోర్డు స్పష్టం చేసింది.