Telangana: మబ్బేసిన తెలుగు రాష్ట్రాలు.. కమ్మేసిన పొగమంచు!
- మేఘావృతమైన ఆకాశం
- పలు ప్రాంతాల్లో చిరుజల్లులు
- పొగమంచుతో విమానాలు ఆలస్యం
మంగళవారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమైంది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పొగమంచు కమ్మేయడంతో ఈ ఉదయం జాతీయ రహదారులపై వాహనాల కదలికలు నెమ్మదిగా సాగుతున్నాయి. శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన రెండు విమానాలు ఆలస్యంగా బయలుదేరుతాయని అధికారులు ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగానే మేఘాలు కమ్మాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల వ్యవధిలో కోస్తాంధ్ర, తెలంగాణలో చిరు జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇక చాలా ప్రాంతాల్లో దట్టమైన మేఘాల కారణంగా సూర్య కిరణాలు భూమిని చేరడం లేదు.