Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ!

  • వైకుంఠ ఏకాదశి నుంచి కొత్త విధానం అమలుకు యోచన
  • నెలకు 24 లక్షల లడ్డూల ఉచిత పంపిణీ 
  • అదనంగా లడ్డూల కొనుగోలుకు అవకాశం

పర్వదినం వైకుంఠ ఏకాదశి నుంచి తిరుమలలో కొత్త విధానం అమలుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యోచిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇవ్వనుంది. నెలకు 24 లక్షల లడ్డూలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఎలాంటి సిఫారసు లేఖలు లేకుండానే భక్తులు అదనంగా లడ్డూలు కొనుగోలు చేసే సౌకర్యాన్ని దేవస్థానం కల్పించింది.  భక్తులు తమకు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్నింటికి కౌంటర్ లో డబ్బులు చెల్లించి పొందవచ్చు. కాగా, ఇప్పటివరకూ తిరుమల కొండపైకి నడక మార్గం ద్వారా వెళ్లిన భక్తులకు లేదా వీఐపీ బ్రేక్ దర్శనాల ద్వారా వెళ్లిన భక్తులకు మాత్రమే ఉచిత లడ్డూ అందజేసేవారు. ఇక నుంచి శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ అందజేయనున్నారు.

  • Loading...

More Telugu News