Minister: ‘విజన్-2020’ అనే చంద్రబాబుకు నిజమైన విజన్ ఏంటో ప్రజలు చూపించారు: కన్నబాబు సెటైర్
- జగన్ పాలన నుంచి ‘విజన్-2020’ మొదలవుతుంది
- రాజధాని అమరావతిలో ఉండదని ఎవరు చెప్పారు?
- పరిపాలనా వికేంద్రీకరణ జరగాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది
చంద్రబాబు ఎప్పుడూ ‘విజన్-2020’ అనే వారని, నిజమైన విజన్ ఏంటో ప్రజలు చూపించారని, ఆయన అధికారంలో లేకుండా చేశారని సెటైర్లు విసిరారు. ‘విజన్-2020’ అనేది జగన్ మోహన్ రెడ్డి పాలన నుంచి మొదలవుతుందని, సంక్షేమ, అభివృద్ధి, అవినీతిరహిత పాలన సీఎం చేస్తున్నారని అన్నారు. ఇంగ్లీషు, ఇసుక, రాజధాని.. ఇలా ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ ప్రజలను చంద్రబాబు పక్కదోవ పట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు.
రాజధాని అంశంపై మంత్రి మాట్లాడుతూ, 'రాజధాని అమరావతిలో ఉండదని ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రి చెప్పారా? మంత్రులు చెప్పారా?' అని ప్రశ్నించారు. అమరావతిలో శాసనసభా వ్యవహారాలు, పరిపాలనా వ్యవస్థ మాత్రం ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో అధికార, పరిపాలనా వికేంద్రీకరణ జరగాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉందని, దాని కోసమే ఓ కమిటీని నియమించి నివేదిక తీసుకున్నామని చెప్పారు.
కాపు ఉద్యమం సమయంలో కంచాలు మోగిస్తూ, నిరసనలు తెలిపిన వారిపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. కాపు ఉద్యమ నేతలపై కేసులు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని, ఆ కేసులను ఎత్తివేసిన చరిత్ర జగన్ దని అన్నారు.