Andhra Pradesh: మూడు రాజధానుల నిర్ణయంపై ఎన్నారైల నిరసన
- ఆస్ట్రేలియాలో ఆంధ్రప్రాంత ఎన్నారైలు ప్లకార్డులతో ప్రదర్శన
- రైతులకు అన్యాయం చేయడం తగదని ఆవేదన
- అన్ని ప్రాంతాల సమానాభివృద్ధే లక్ష్యంగా సాగాలని నినాదం
ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై ఎన్నారైలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎన్నారైలు అమరావతి రైతులకు మద్దతుగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నారైలు మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు అన్యాయం చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అన్ని ప్రాంతాల మధ్య గొడవలు పెట్టినట్టు అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలన్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో రైతుల్లో అశాంతి నెలకొందన్నారు. శాంతి భద్రతలపైనా, రాష్ట్రాభివృద్ధిపైనా ఈ ప్రభావం పడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు.