Tirumala: తిరుమల ఖాళీ... గంటలోనే దర్శనం!

  • తగ్గిన న్యూ ఇయర్ హడావుడి
  • వైకుంఠ ఏకాదశికి ఐదు రోజుల సమయం
  • మూడు కంపార్టుమెంట్లలోనే భక్తులు

సప్తగిరులు వెలవెలబోతున్నాయి. న్యూ ఇయర్ హడావుడి తగ్గడం, సంక్రాంతి సెలవులకు మరో వారం రోజులు సమయం ఉండటంతో భక్తుల రాక మందగించింది. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మూడు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి గరిష్ఠంగా రెండు గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.

ఇక టైమ్ స్లాట్, ప్రత్యేక, దివ్య దర్శనం టోకెన్లు కలిగివున్న భక్తులకు గంట నుంచి రెండు గంటల్లోపు దర్శనం చేయిస్తున్నారు. బుధవారం స్వామివారికి హుండీ ద్వారా రూ. 3.93 కోట్ల ఆదాయం లభించింది. దాదాపు 95 వేల మంది స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ వారాంతం వరకూ భక్తుల రద్దీ సాధారణంగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నామని, ఆపై వైకుంఠ ఏకాదశి నుంచి రద్దీ పెరుగుతుందని భావిస్తున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News