Sensex: అమెరికా దాడుల ప్రభావం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- జనరల్ ఖాసిం సోలెమన్ ను మట్టుబెట్టిన అమెరికా
- ఆసియా, యూరప్ మార్కెట్లపై ప్రభావం
- 162 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఎయిర్ పోర్టుపై అమెరికా బలగాలు జరిపిన రాకెట్ దాడుల్లో ఇరాన్ కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ జనరల్ ఖాసిం సోలెమన్ హతమైన సంగతి తెలిసిందే. దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై కూడా పడింది. ఫలితంగా ఏసియన్ మార్కెట్లతో పాటు యూరోపియన్ మార్కెట్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మన మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 162 పాయింట్లు నష్టపోయి 41,464కు పడిపోయింది. నిఫ్టీ 55 పాయింట్లు పతనమై 12,226 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (2.08%), టీసీఎస్ (1.99%), హెచ్సీఎల్ (1.66%), ఇన్ఫోసిస్ (1.48%). టెక్ మహీంద్రా (1.17%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-2.16%), యాక్సిస్ బ్యాంక్ (-1.90%), బజాజ్ ఆటో (-1.78%), ఎన్టీపీసీ (-1.57%), బజాజ్ ఫైనాన్స్ (-1.52%).