Andhra Pradesh: ఏపీలో జిల్లా పరిషత్ లకు రిజర్వేషన్లు ఖరారు
- పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ప్రకటన
- మొత్తం 13 జిల్లాలకు రిజర్వేషన్ల వెల్లడి
- స్థానిక సంస్థల కంటే ముందే జడ్పీ ఎన్నికలు?
ఆంధ్రప్రదేశ్ లో జిల్లా పరిషత్ లకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 13 జిల్లాలకు సంబంధించి రిజర్వేషన్లను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికలకంటే ముందే జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
జిల్లా పరిషత్ రిజర్వేషన్ల వివరాలు
నెల్లూరు- ఎస్టీ
అనంతపురం- ఎస్సీ
విజయనగరం-ఎస్సీ (మహిళ)
చిత్తూరు-బీసీ
కృష్ణా- బీసీ
విశాఖపట్నం- బీసీ (మహిళ)
పశ్చిమ గోదావరి- బీసీ (మహిళ)
తూర్పు గోదావరి- జనరల్ (మహిళ)
శ్రీకాకుళం- జనరల్
వైఎస్ఆర్ కడప- జనరల్
ప్రకాశం- జనరల్
గుంటూరు- జనరల్ (మహిళ)
కర్నూలు- జనరల్ (మహిళ)