Congress: కాంగ్రెస్ సేవాదళ్ పుస్తకంపై ఉద్ధవ్ మౌనం.. ఇంటిపేరును గాంధీగా మార్చుకోవాలన్న జీవీఎల్
- వీర్ సావర్కర్-నాథూరం గాడ్సేల మధ్య శారీరక సంబంధం ఉందంటూ పుస్తకం
- శివసేన మౌనాన్ని తీవ్రంగా తప్పుబట్టిన బీజేపీ
- స్వయం ప్రకటిత పులి మూగబోయిందని ఎద్దేవా
వీర్ సావర్కర్, నాథూరం గాడ్సేల మధ్య శారీరక సంబంధం ఉందంటూ కాంగ్రెస్ సేవాదళ్ ప్రచురించిన పుస్తకంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మౌనంగా ఉండడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఉద్ధవ్ తన ఇంటిపేరు థాకరేను తొలగించి గాంధీ అని కానీ, జిన్నా అని కానీ మార్చుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.
స్వయం ప్రకటిత పులి ఉద్ధవ్ గొంతు మూగబోయిందని దుయ్యబట్టారు. వీర్ సావర్కర్‌కు స్వయం ప్రకటిత భక్తుడైన ఉద్ధవ్.. కాంగ్రెస్ సేవాదళ్ ప్రచురించిన పుస్తకంలో అనుచిత వ్యాఖ్యలను ఖండించకపోవడం దారుణమన్నారు. స్వయం ప్రకటిత పులి మూగబోయి భయపడుతోందని ఎద్దేవా చేశారు. దీనిని ఖండించకపోతే ఉద్ధవ్ తన పేరు చివరన ఉన్న థాకరే అనే పదాన్ని కొనసాగించే హక్కును కోల్పోతారని జీవీఎల్ అన్నారు.