YSRCP: పైసా ఖర్చు పెట్టకుండా రాజధానిని నిర్మించొచ్చు.. ఆ బాధ్యత మాకు ఇవ్వండి: వైసీపీ ప్రభుత్వానికి సీపీఐ నారాయణ ఛాలెంజ్

  • రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టలేమని ప్రభుత్వం అంటోంది
  • ఐదు, పది వేల కోట్లు కాదు పైసా కూడా ఖర్చు కాదు
  • క్యాపిటల్ కట్టే బాధ్యత తీసుకుంటాం, ఒప్పుకుంటారా?

రాజధాని అమరావతిని నిర్మించాలంటే లక్ష కోట్లు కావాలని, ప్రభుత్వం దగ్గర అంతడబ్బు లేదని చెబుతున్న వైసీపీ ప్రభుత్వానికి సీపీఐ నారాయణ ఛాలెంజ్ విసిరారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క  పైసా కూడా ఖర్చుపెట్టకుండా, రాజధాని భూముల్లో కావాల్సిన డిజైన్లలో, ఏ పద్ధతిలో క్యాపిటల్ కావాలో ఆ పద్ధతిలో నిర్మించేందుకు అవకాశాలు ఉన్నాయని సూచించారు.

రాజధానికి ఐదు వేలు, పది వేల కోట్లు కూడా అక్కర్లేదు, పైసా ఖర్చు లేకుండా క్యాపిటల్ కట్టించే బాధ్యత తీసుకుంటాం, ఒప్పుకుంటారా? మీకు నిజాయతీ ఉందా? అని ప్రశ్నించారు. ఆరు వేల ఎకరాల్లో క్యాపిటల్ నిర్మించుకుని, మిగిలిన భూమిని డెవలప్ మెంట్ కు ప్రభుత్వం ఇవ్వగలిగితే రెవెన్యూ వస్తుందని, ‘ఇవన్నీ సింపుల్ క్యాలిక్ లేషన్’ అని అన్నారు. నిజంగా నిద్రపోతున్న వాళ్లను లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్లు నటిస్తున్న వాళ్లను లేపలేమంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

  • Loading...

More Telugu News