Tirumala: కనిపించని రద్దీ... తిరుమలలో ఒకే కంపార్టుమెంట్ లో భక్తులు!

  • 6న వైకుంఠ ఏకాదశి
  • ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ
  • 4 కి.మీ. క్యూలైన్ల ఏర్పాటు

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిపోయింది. 6న వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉండటంతోనే భక్తుల రాక మందగించినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం స్వామి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు వేచి చూస్తున్నారు. వీరికి రెండు గంటల్లోనే దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న తిరుమల స్థానికులు స్వామి దర్శనం కోసం వెళుతున్నారు.

దివ్య దర్శనం, రూ. 300 టికెట్ల ప్రత్యేక దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన వారికి కూడా రెండు గంటల్లోనే దర్శనం పూర్తవుతోంది. నేటి అర్థరాత్రి 12 గంటలకు దర్శనాన్ని ఆపేస్తామని, ఆపై 2 గంటల నుంచి వైకుంఠ ద్వారాలను తెరుస్తామని అధికారులు తెలిపారు. తొలుత వీఐపీ దర్శనాల అనంతరం సామాన్య భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. 85 వేల మంది వేచి వుండేలా ఏర్పాట్లు చేశామని, 4 కిలోమీటర్ల మేరకు క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, తాత్కాలిక చలువ పందిళ్లు నిర్మించామని తెలిపారు.

  • Loading...

More Telugu News