banks: 8న బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె!
- కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయాలు
- సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంకు సంఘాలు
- ఏటీఎం సేవలపైనా ప్రభావం
ఈ నెల 8వ తేదీ బుధవారం నాడు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తూ, యూనియన్లు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో బ్యాంకు శాఖల్లో నిత్యమూ జరిగే లావాదేవీలకు విఘాతం కలుగనుండగా, ఏటీఎం సేవలపైనా ప్రభావం పడనుంది.
బ్యాంక్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్లన్నీ ఈ సమ్మెకు మద్దతు పలికాయి. ఇదే సమయంలో లావాదేవీలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ పై ఈ ప్రభావం ఉండదని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి.