Donald Trump: ఇరాన్ ఎన్నడూ రుచి చూడనంత తీవ్రమైన దాడి చేస్తాం: ట్రంప్ హెచ్చరిక
- మాపై ఇరాన్ దాడి చేసింది
- అందుకే మేము ప్రతిదాడి చేశాం
- మరోసారి దాడి చేస్తే అంతే సంగతి
- ఇరాన్ మరోసారి దాడులకు పాల్పడవద్దు
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా రాకెట్ దాడి చేసి ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సులేమనీను చంపేసిన విషయం తెలిసిందే. అనంతరం కూడా పలుసార్లు దాడికి దిగడంతో ఇరాక్, ఇరాన్ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు.
'మాపై ఇరాన్ దాడి చేసింది.. అందుకే మేము ప్రతిదాడి చేశాం. మరోసారి దాడి చేస్తే ఇరాన్ ఎన్నడూ రుచి చూడనంత తీవ్రమైన దాడిని చేస్తాం. ఇరాన్ మరోసారి దాడులకు పాల్పడవద్దని నేను సూచిస్తున్నాను' అని ట్రంప్ హెచ్చరించారు.