Road Accident: మంటల్లో చిక్కుకున్న బస్సు : తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం

  • లారీ ఢీకొట్టడంతో దుర్ఘటన ..బాధితులు ఉత్తరాఖండ్ వాసులు
  • ప్రయాణికుల అప్రమత్తతో గాయాలతో బయటపడిన వైనం 
  • శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో ఘటన

ఊహించని ప్రమాదమే...అయినా అదృష్ట వశాత్తు ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. కాస్త ముందు ప్రమాదం జరిగినా, ప్రయాణికులు నిద్రలో ఉన్నా ప్రమాదాన్ని ఊహించడమే కష్టమయ్యేది. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం వద్ద యాత్రికులతో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు మంటల్లో చిక్కుకుని దగ్గమైంది. ప్రయాణికులు అప్రమత్తమై దిగిపోవడంతో ఘోర దుర్ఘటన తప్పింది. వివరాల్లోకి వెళితే... ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆల్వానీకి చెందిన 50 మంది యాత్రికులతో ఓ బస్సు జాతీయ రహదారిపై వస్తోంది.

వీరంతా పూరీ నుంచి రామేశ్వరం వెళ్తున్నారు. పైడిభీమవరం పారిశ్రామికవాడ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ట్రాలీ లారీ బస్సును ఢీకొట్టింది. దీంతో పలువురు యాత్రికులకు గాయాలయ్యాయి. ఊహించని ఘటనతో బిత్తరపోయిన ప్రయాణికులు బస్సు దిగిన కాసేపటికే బస్సులో మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి.

అగ్నిమాపక అధికారులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రయాణికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించారు. ఆప్పటికే యాత్రికులంతా బస్సు దిగిపోవడంతో ఎవరికీ ఏమీ కాలేదు. కాకపోతే పలువురి యాత్రికుల విలువైన వస్తువులు కాలిపోయాయి.

  • Loading...

More Telugu News