Yanamala: ఆర్టికల్ 360 కింద రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలి: యనమల

  • ఈ ప్రభుత్వం 7 నెలల్లోనే రూ.35 వేల కోట్ల అప్పులు చేసింది
  • ఆదాయం పడిపోవడమే కాకుండా రెవెన్యూ వ్యయం పెరిగింది
  • రాష్ట్రంలో మూల ధన వ్యయం రూ.10,486 కోట్లు తగ్గింది
  • వచ్చే ఆదాయం అంతా జీతాలు, పింఛన్లకే సరిపోతుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం ఏడు నెలల్లోనే రూ.35 వేల కోట్ల అప్పులు చేసిందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఆర్టికల్ 360 కింద రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఆదాయం పడిపోవడమే కాకుండా రెవెన్యూ వ్యయం పెరిగిందని యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్రంలో మూల ధన వ్యయం రూ.10,486 కోట్లు తగ్గిందని ఆయన చెప్పారు. వచ్చే ఆదాయం అంతా జీతాలు, పింఛన్లకే సరిపోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News