Tirumala: వైకుంఠద్వారాలను పది రోజులు తెరవాలన్న అంశంపై చర్చకు రమణదీక్షితులు గైర్హాజరు
- రేపు వైకుంఠ ఏకాదశి
- టీటీడీ అత్యవసర సమావేశం
- వైకుంఠ ద్వారాలు పది రోజులు తెరిచేందుకు నలుగురు సభ్యుల ఆమోదం
రేపు వైకుంఠ ఏకాదశి కావడంతో వైకుంఠ ద్వారాలను పది రోజుల పాటు తెరిచి ఉంచే అంశంపై చర్చించేందుకు టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. అయితే ఈ కీలక సమావేశానికి ఆగమశాస్త్ర సలహా మండలి సభ్యుడు రమణదీక్షితులు హాజరుకాలేదు. వైకుంఠ ద్వారాలను 10 రోజుల పాటు తెరిచేందుకు మిగిలిన నలుగురు సభ్యులు తమ ఆమోదం తెలిపారు. రమణదీక్షితులు దీనికి ఆమోదం తెలపలేదు.
కాగా, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రెండు రోజుల పాటు మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచేందుకు టీటీడీ ఇంతకుముందు నిర్ణయించింది. అయితే పది రోజులు తెరిచి ఉంచాలని భక్తుల నుంచి ప్రతిపాదనలు వస్తున్న నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది.