Tirumala: నేడు ముక్కోటి ఏకాదశి.. కిటకిటలాడుతున్న పుణ్యక్షేత్రాలు

  • భక్తులతో పోటెత్తుతున్న ఆలయాలు
  • తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

నేడు ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి)ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. భగవన్నామ స్మరణతో మార్మోగుతున్నాయి.  తెల్లవారక ముందే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామి వార్లను దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజల్లో మునిగితేలుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల వేంకటేశుని దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు.

వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర మహేశ్వరి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్, ఏపీ మంత్రులు పుష్ప శ్రీవాణి, పెద్దిరెడ్డి, అనిల్, అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేశ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మల్లారెడ్డి, శ్రీనివాసగౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

తెలంగాణలోని భద్రాద్రి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. తెలంగాణ మంత్రులు పువ్వాడ అజయ్ దంపతులు, సత్యవతి రాథోడ్‌లు ఇప్పటికే దర్శనం చేసుకున్నారు. ఉదయం ఆరు గంటల వరకు ఉత్తరద్వార దర్శనం కొనసాగింది. మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News