New Delhi: బాధితులెవరో గుర్తిస్తే నిందితులెవరో తేలుతుంది: జెఎన్‌యూ ఘటనపై ఢిల్లీ పోలీస్ లాయర్

  • ఈ ఘటన సిగ్గుపడేలా చేసింది 
  • ట్విట్టర్లో ఘాటు వ్యాఖ్యలు చేసిన రాహుల్ మెహ్రా 
  • అమాయకులైన విద్యార్థులపై దాడి అమానుషం

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ఘటనలో బాధితులెవరో గుర్తిస్తే దాడి చేసింది ఎవరో అంచనాకు రావచ్చునని ఢిల్లీలో పోలీసుల తరపు న్యాయవాది రాహుల్ మెహ్రా అన్నారు. ముఖ్యంగా గాయపడింది ఏబీవీపీ విద్యార్థులా, వామపక్ష విద్యార్థులా? అన్నది తేల్చాలని కోరారు. జేఎన్‌యూలోకి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి విద్యార్థులపై దాడి చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

ముసుగులు ధరించి వచ్చిన వ్యక్తులు చేసిన దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం (ఏఎన్‌యూఎన్‌యూ) అధ్యక్షురాలు అయిషీఘోష్ తోపాటు మొత్తం 20 మందికి తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ట్విట్టర్లో రాహుల్ స్పందిస్తూ పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రౌడీ మూకలు యథేచ్ఛగా చెలరేగిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. 'హింసకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ చూశాక ఢిల్లీ పోలీస్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిని అయిన నేను సిగ్గుతో తలదించుకున్నాను' అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News