CM Jagan: స్థానిక సమరం...రేపు జిల్లా ఇన్‌చార్జి మంత్రులతో సీఎం జగన్ భేటీ
- ఎన్నికలపై దిశానిర్దేశం చేసే అవకాశం
- ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం
- మూడు రాజధానుల అంశం పైనా ఆరా
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రేపు అమరావతిలో జిల్లా ఇన్ చార్జి మంత్రులతో సమావేశమవుతున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, మూడు రాజధానుల అంశంపై రాష్ట్రంలో వేడెక్కిన వాతావరణం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ స్థానిక సమరంలోనూ అదే సత్తా చాటాలని యోచిస్తోంది. లేదంటే ఏడు నెలల పాలనలోనే ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోందన్న విపక్షాల విమర్శలకు బలం చేకూర్చినట్టవుతుంది. అందువల్ల ఈ సమావేశంలో రాజధాని అంశంపై జిల్లాల వారీగా సమీక్ష, ఎన్నికలకు సంబంధించి మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం వంటి నిర్ణయాలను సీఎం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.