New Delhi: విద్యార్థులను రాజకీయ పనిముట్లుగా వాడుకోవడం తగదు: స్మృతి ఇరానీ

  • ఢిల్లీలో జేఎన్ యూ క్యాంపస్ లో విద్యార్థులపై దాడి
  • జేఎన్ యూ విద్యార్థులపై దాడిని ఖండించిన స్మృతి
  • వర్సిటీ క్యాంపస్ లను యుద్ధభూములుగా మార్చొద్దని హితవు
ఢిల్లీ జేఎన్ యూలో విద్యార్థులపై దుండగుల దాడిని ఖండిస్తున్నట్టు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. రాజకీయాల కోసం విద్యాసంస్థలను ఉపయోగించుకోవద్దని, విశ్వవిద్యాలయ ప్రాంగణాలను యుద్ధభూములుగా మార్చొద్దని హితవు పలికారు. ఇలాంటి రాజకీయాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయని, రాజకీయ పనిముట్లుగా విద్యార్థులను వాడుకోవడం సరికాదని అన్నారు. తాను ఇదే సందేశాన్ని గతంలో కూడా ఇచ్చానని వివరించారు. ఈ దాడి ఘటన పట్ల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని స్మృతి పేర్కొన్నారు.
New Delhi
JNU
Students
Smrithi Irani

More Telugu News