sabarimala: శబరిమలలోకి మహిళల ప్రవేశం.. 13 నుంచి సుప్రీంలో వాదనలు
- శబరిమలలోకి మహిళల ప్రవేశానికి అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు
- తీర్పును పునఃపరిశీలించాలంటూ పిల్
- విచారణకు 9 మంది న్యాయమూర్తులతో విస్తృత ధర్మాసనం
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై ఈ నెల 13 నుంచి సుప్రీంకోర్టు వాదనలు విననుంది. 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం వాదనలు విననున్నట్టు సుప్రీం కోర్టు నిన్న తెలిపింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంతోపాటు దర్గాలు, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, ఇతర మతస్థుల్ని పెళ్లాడే పార్సీ మహిళలకు మతపరమైన ప్రాంగణాల్లో ప్రవేశం లేకపోవడం తదితర అంశాలపైనా సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ 65 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా, ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ పిల్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 13 నుంచి వాదనలు విననున్నట్టు తెలిపింది.