Ramya: వివాహేతర బంధం పెట్టుకుని, నన్ను ఏడిపిస్తున్నాడు: తమిళ నటి రమ్య

  • అదనపు కట్నం తేవాలని నిత్యమూ గొడవ
  • 2017లో డ్యాన్స్ మాస్టర్ ను వివాహమాడిన రమ్య
  • అప్పటి నుంచి డబ్బు కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు
తన భర్త మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను వేధిస్తున్నాడని తమిళ నటి రమ్య బెంగళూరు, కోడిగేహళ్లి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ప్రకారం, అదనపు కట్నం తీసుకురావాలని భర్త వరదరాజన్ వేధిస్తున్నాడు. 2017లో తనకు డ్యాన్స్ మాస్టర్ గా ఉన్న వరదరాజన్ తో వివాహం జరిగిందని, ఆ సమయంలో ఇంటి స్థలం, బంగారం, ఆభరణాలు, డబ్బును కట్నంగా ఇచ్చామని చెప్పింది. 'వరదరాజన్‌ డ్యాన్స్‌ అకాడమీ'ని స్థాపించాలని భావిస్తున్న తన భర్త, అందుకు కావాల్సిన డబ్బులు తెచ్చివ్వాలని తన వెంట పడ్డారని రమ్య ఆరోపించింది. తనకు నిత్యమూ హింస ఎదురవుతోందని ఆమె ఆరోపించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.
Ramya
Harrasment
Tamil

More Telugu News