KPL: మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఎట్టకేలకు అరెస్ట్ అయిన అంతర్జాతీయ బుకీ

  • కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్
  • ఫిక్సింగ్, బెట్టింగ్‌కు పాల్పడిన బుకీ జతిన్
  • ఆరోపణలు రావడంతో నెదర్లాండ్స్‌కు పరారీ

కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌‌లో మ్యాచ్‌ఫిక్సింగ్‌‌, బెట్టింగ్‌కు పాల్పడిన అంతర్జాతీయ బుకీ జతిన్‌ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. రెడ్ కార్నర్ నోటీసు జారీ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బెంగళూరు చేరుకున్న జతిన్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన జతిన్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కీలక సూత్రధారి.

కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత జతిన్ నెదర్లాండ్స్ పారిపోయాడు. ముందస్తు బెయిలు సంపాదించి తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు. అయితే, అతడి కోసం వేట ముమ్మరం చేసిన పోలీసులు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో వెనక్కి తిరిగి రాక తప్పలేదు. అతడు బెంగళూరుకు చేరుకున్న వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే కోచ్‌లు, క్రీడాకారులు, ఫ్రాంచైజీలను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News