Sensex: నిన్నటి భారీ పతనం నుంచి కోలుకున్న మార్కెట్లు
- 193 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 60 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2 శాతం పైగా లాభపడ్డ అల్ట్రాటెక్ సిమెంట్
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాందోళనల నేపథ్యంలో నిన్న స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ ఏకంగా 788 పాయింట్లు కోల్పోయింది. అయితే, ఈరోజు మార్కెట్లు నష్టాల నుంచి కోలుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో భారీ లాభాల్లోకి వెళ్లిన సూచీలు... ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురై... కొంతమేర లాభాలను కోల్పోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 193 పాయింట్లు లాభపడి 40,869కి చేరింది. నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 12,053 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (2.10%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.65%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.53%), ఎన్టీపీసీ (1.51%), సన్ ఫార్మా (1.50%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.40%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.91%), నెస్లే ఇండియా (-0.75%), హీరో మోటో కార్ప్ (-0.57%), భారతి ఎయిర్ టెల్ (-0.57%).