Telangana: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు తొలగిన అడ్డంకి
- రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే ఎన్నికలేంటన్న ఉత్తమ్
- హైకోర్టులో పిటిషన్
- పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం
తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే ఎలా నోటిఫికేషన్ ఇస్తారంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రెండ్రోజుల పాటు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దాంతో మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకి తొలగినట్టయింది.