High Power Committee: హైపవర్ కమిటీలో రాజధాని కట్టినోడు ఒక్కడున్నాడా?: నారా లోకేశ్

  • ఏముంది హైపవర్ కమిటీలో?
  • ఇటుకేసినోడు ఒక్కడున్నాడా?
  • జీఎన్ రావు కమిటీ .. వాళ్ల జీవితంలో రాజధాని కట్టారా?

ఏపీ సమగ్రాభివృద్ధికి జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రైతుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న నారా లోకేశ్ ను, టీడీపీ నాయకులను ఈరోజు మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేసి సాయంత్రం సమయంలో విడుదల చేశారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ నుంచి లోకేశ్ విడుదలయ్యే సమయానికే హైపవర్ కమిటీ సమావేశం జరుగుతోంది.

ఈ విషయమై లోకేశ్ ను మీడియా ప్రశ్నించగా.. ‘ఏముంది హైపవర్ కమిటీలో? రాజధాని కట్టినోడు ఒకడున్నాడా దాంట్లో? ఇటుకేసినోడు ఒక్కడున్నాడా? జీఎన్ రావు కమిటీ అన్నారు!.. వాళ్ల జీవితంలో రాజధాని కట్టారా? బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అన్నారు! ఆ మనుషులు ఎవరో తెలియదు?’ అని విమర్శించారు. బోస్టన్ కన్సల్టింగ్ సంస్థకు జీవో ఎప్పుడిచ్చారో, అసలు, ఆ సంస్థకే ఎందుకిచ్చారో, వాళ్లకు ఏం అనుభవం ఉందో ఎవరికీ తెలియదు? అని, ఆ కమిటీ గ్రామాల్లో ఎప్పుడూ పర్యటించలేదని తీవ్రంగా విమర్శించారు.

  • Loading...

More Telugu News