Sabarimala: శబరిమల కేసు విచారణకు.. 9 మంది న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు!
- ప్రార్థనా మందిరాల్లో లింగ భేదం
- 13 నుంచి వాదనలు విననున్న ధర్మాసనం
- రివ్యూ పిటిషన్లపై తుది తీర్పు ఇవ్వనున్న సుప్రీం
శబరిమలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో లింగ భేదం లేకుండా అందరినీ అనుమతించే విషయమై తుది తీర్పును ఇచ్చేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనం వివిధ మతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై విచారణ జరపనుంది. మొత్తం 9 మంది న్యాయమూర్తులు, ఈ నెల 13 నుంచి వాదనలు విననున్నారు.
చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎంఎం శంతనగౌడర్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ లు ఈ బెంచ్ లో ఉంటారు. అన్ని వయసుల వారినీ శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతినిస్తూ, 2018లో నాటి సీజే జస్టిస్ రంజన్ గొగొయ్ ధర్మాసనం తీర్పివ్వగా, దానిపై రివ్యూ పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.